జూలై 31న 'కింగ్డమ్'!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ 'కింగ్డమ్' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. జూలై 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటింగ్ 'కింగ్డమ్' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. జూలై 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. రిలీజ్ డేట్ తో పాటు.. ఓ స్పెషల్ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో విజయ్ పోలీస్ గా, ఖైదీగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు.
'లైగర్' ఫెయిల్యూర్ తర్వాత మళ్లీ గ్రేట్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్. విజయ్ నెవర్ బిఫోర్ లుక్ లో సందడి చేయబోతున్న ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో 'కింగ్డమ్'పై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ సినిమాలో విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ నటిస్తే.. కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. మొత్తంగా.. పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' వస్తోన్న వారానికే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' థియేటర్లలోకి రాబోతుంది.