అమెరికాలో ‘కన్నప్ప‘ ప్రీమియర్స్ ఫిక్స్!

శివ భక్తుడి పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ భారీ పౌరాణిక చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.;

By :  S D R
Update: 2025-06-23 08:53 GMT

శివ భక్తుడి పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ భారీ పౌరాణిక చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రమోట్ చేశారు. అలాగే అమెరికాలోనూ మంచు విష్ణు ప్రత్యేకంగా ‘కన్నప్ప‘ ప్రచారాన్ని నిర్వహించాడు. లేటెస్ట్ గా అమెరికాలో ‘కన్నప్ప‘ ప్రీమియర్స్ పై క్లారిటీ వచ్చేసింది. జూన్ 26న మధ్యాహ్నం 3 గంటల నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని యు.ఎస్.ఎ. లో వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తుంది.

మరోవైపు నైజాం, సీడెడ్ లలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుండటం విశేషం. జూన్ 24 నుంచి ‘కన్నప్ప‘ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి పలు భాషలకు సంబంధించిన స్టార్స్ ను ‘కన్నప్ప‘లో చూసే అవకాశం ఉండటంతో.. ఈ సినిమాకోసం పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



Tags:    

Similar News