‘కన్నప్ప’ మోషన్ పోస్టర్ – ప్రతీ పాత్ర స్పెషల్!
By : Surendra Nalamati
Update: 2025-02-21 19:44 GMT
మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం 'కన్నప్ప'. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనువిందు చేయబోతుంది. ముఖ్యంగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కేమియోలలో మురిపించబోతున్నారు.
ఇంకా మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, ముఖేష్ రుషి, మధుబాల, దేవరాజ్ వంటి సీనియర్స్ నటిస్తున్నారు. అలాగే విష్ణు తనయుడు, తనయలు ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోన్న 'కన్నప్ప' ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి నటీనటులందరూ పోషిస్తున్న పాత్రలతో ఓ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.