మాసీ బీట్స్ తో కళ్యాణ్‌రామ్
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి 'కాంతార, విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.;
By : S D R
Update: 2025-03-31 12:11 GMT
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఈ చిత్రానికి 'కాంతార, విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అజనీష్ అనగానే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తుకు వస్తుంది. అయితే ఈ సినిమాకోసం అజనీష్ 'నాయాల్దీ' అనే మాసీ బీట్స్ సాంగ్ ను అందించాడు. ఈ పెప్పీ నంబర్ లో కళ్యాణ్ రామ్ డ్యాన్సుల్లో అదరగొట్టాడు.
హీరోహీరోయిన్లు కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ లపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాటను నరసరావుపేటలో భారీ అభిమాన సందోహం మధ్య లాంఛ్ చేశారు. రఘురామ్ లిరిక్స్ తో నకాష్ అజీజ్, సోనీ కోమండూరి ఆలపించిన ఈ గీతం ఆకట్టుకుంటుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఈ వేసవిలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది.