జురాసిక్ వరల్డ్ న్యూ అడ్వెంచర్!

మూడు దశాబ్దాల క్రితం హాలీవుడ్ అగ్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సృష్టించిన అద్భుత చిత్రరాజం 'జురాసిక్ పార్క్'. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద జీవించిన డైనోసార్స్ ను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించాడు స్పీల్‌బర్గ్.;

By :  S D R
Update: 2025-02-06 01:08 GMT

మూడు దశాబ్దాల క్రితం హాలీవుడ్ అగ్ర దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ సృష్టించిన అద్భుత చిత్రరాజం 'జురాసిక్ పార్క్'. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద జీవించిన డైనోసార్స్ ను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించాడు స్పీల్‌బర్గ్. ఈ సినిమా ఘన విజయంతో వరుసగా 'జురాసిక్ పార్క్' సిరీస్ లో ఇప్పటివరకూ ఆరు చిత్రాలొచ్చాయి. ఇక ఈ ఫ్రాంచైస్‌లో ఏడవ చిత్రంగా రాబోతుంది 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'. 2022లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్ డొమినియన్'కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది.

'జురాసిక్ వరల్డ్ డొమినియన్' సంఘటనలకు ఐదు సంవత్సరాల తర్వాత భూమి వాతావరణం డైనోసార్లకు అనుకూలంగా లేకుండా మారిపోయింది. ఇప్పుడు మిగిలిపోయిన డైనోసార్లు కొన్ని దూర ప్రాంతంలోని ఉష్ణమండల అడవుల్లో మాత్రమే జీవిస్తాయి. ఆ డైనోసార్ల డి.ఎన్.ఎ ను సేకరించడం కోసం వెళ్లిన బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేదే 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'గా చెబుతోంది టీమ్.

ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ప్రధాన పాత్రలో నటించింది. ఇతర కీలక పాత్రల్లో మహర్షల అలి, జొనాథన్ బైలీ, రుపర్ట్ ఫ్రెండ్ కనిపించనున్నారు. ఈ సినిమాకి గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించగా.. యూనివర్శల్ పిక్చర్స్ వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. జూలై 2న 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' రిలీజవుతుంది.


Full View



Tags:    

Similar News