ఎన్టీఆర్ కి నివాళులర్పించిన మనవళ్లు

దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ మనవళ్లు.. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద మహానాయకుడికి నివాళులర్పించారు.;

By :  S D R
Update: 2025-05-28 03:44 GMT

దివంగత మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఎన్టీఆర్ మనవళ్లు.. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఘాట్ వద్ద మహానాయకుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో అందించిన సేవలను వారు గౌరవంగా స్మరించుకున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించారు. ఘాట్ పరిసరాలను పుష్పాలతో అలంకరించి ఎన్టీఆర్ జ్ఞాపకాలను తలపించేలా రూపొందించారు.

ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఆయనకు శ్రద్ధాంజలి అర్పించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మొదటగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘాట్‌ను సందర్శిస్తుంటారు. అనంతరం ఇతర కుటుంబ సభ్యులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, అభిమానులు ఘాట్ ను సందర్శిస్తారు.

Tags:    

Similar News