ఎన్టీఆర్ ను ఆశ్చర్యపరిచిన జపాన్ ఫ్యాన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘RRR‘ సినిమా తారక్ ను గ్లోబల్ ఆడియన్స్ కు బాగా దగ్గర చేసింది.;

By :  S D R
Update: 2025-03-27 09:52 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘RRR‘ సినిమా తారక్ ను గ్లోబల్ ఆడియన్స్ కు బాగా దగ్గర చేసింది. ఈకోవలోనే జపాన్ లో ఎన్టీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ ‘దేవర‘ చిత్రం జపాన్ లో విడుదలకు ముస్తాబవుతుంది.

మార్చి 28న రిలీజ్ కు రెడీ అయిన ‘దేవర‘ని ప్రమోట్ చేయడానికి ప్రస్తుతం జపాన్ లో విహరిస్తున్నాడు తారక్. తాజాగా జపాన్ లో ఓ ఫ్యాన్ తెలుగు మాట్లాడుతూ ఎన్టీఆర్ ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆ విషయాన్ని తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో పంచుకున్నాడు తారక్.

‘జపాన్ కు నా ప్రతి ప్రయాణం అందమైన జ్ఞాపకాల్ని అందిస్తుంటుంది, కాని ఈసారి అనుభవం కొంచెం విభిన్నంగా అనిపించింది. ఓ జపానీస్ అభిమాని, ‘RRR‘ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పినప్పుడు, నా మనసు కదిలిపోయింది. సినిమా మరియు భాషలను ప్రేమించే నేను, ఒక సినిమా.. భాషలకు, సంస్కృతులకు మధ్య బ్రిడ్జ్ గా మారడం, ఒక అభిమాని కొత్త భాషను నేర్చుకునేలా ప్రేరేపించడం చిరకాలం గుర్తుంచుకునే అనుభూతి. భారతీయ సినిమా ప్రపంచమంతటా విస్తరించేందుకు మరో అద్భుతమైన కారణం!‘ అంటూ ఆ వీడియోని షేర్ చేశాడు.

https://x.com/tarak9999/status/1905182568032407779

Tags:    

Similar News