మంచు విష్ణుకు శివుడి పరీక్ష!?
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప‘ చిత్రానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో, సినిమా నుంచి కీలకమైన హార్డ్‌డ్రైవ్ మిస్ అవ్వడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.;
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప‘ చిత్రానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో, సినిమా నుంచి కీలకమైన హార్డ్‌డ్రైవ్ మిస్ అవ్వడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.
ఈ విషయమై ఇప్పటికే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్‌కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హెచ్‌ఐవీఈ స్టూడియోస్ నుంచి కొరియర్ ద్వారా పంపిన ఈ హార్డ్‌డ్రైవ్‌ను మే 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకుని, చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ కనిపించకుండా పోయారు.
ఈ హార్డ్‌డ్రైవ్‌లో ‘కన్నప్ప‘ చిత్రానికి సంబంధించిన సుమారు 90 నిమిషాల ఫుటేజ్, ముఖ్యంగా ప్రభాస్ నటించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. ‘కన్నప్ప‘ హార్డ్ డ్రైవ్ మిస్సైన నేపథ్యంలో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘జటాజూఠధారి, నీ కోసం తపస్సు చేస్తున్న నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?‘ అంటూ సోషల్ మీడియాలో #హరహరమహదేవ్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆవేదన వ్యక్తం చేశాడు.