సూర్య-వెంకీ కాంబోపై భారీ అంచనాలు!
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.;
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'రెట్రో' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సూర్య స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా మే నెల నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.
ఈ చిత్రం మాఫియా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, ఓ డాన్ చుట్టూ నడుస్తుందని సమాచారం. పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ స్టోరీని డిజైన్ చేశాడట వెంకీ అట్లూరి. ఈ క్రేజీ కాంబోపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
జీవి ప్రకాష్ సంగీతం అందించనుండగా, మ్యూజిక్ పనులు దుబాయ్‌లో ప్రారంభమయ్యాయి. హీరోయిన్‌గా మొదట భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించినా, చివరకు కాయదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రానికి త్వరలోనే మోషన్ పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన రానుందట.
మే 1న 'రెట్రో'ని విడుదల చేస్తున్న సూర్య.. ఆర్.జె.బాలాజీ దర్శకత్వంల్ తన 45వ చిత్రాన్ని చేస్తున్నాడు. సూర్య-బాలాజీ సినిమా ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. అలాగే వెట్రిమారన్ తో 'వాడివాసల్' కూడా లైన్లో ఉంది. మొత్తంగా సూర్య కిట్టీలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, వెంకీ అట్లూరి సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభిమానులు ఈ కాంబినేషన్ నుంచి కొత్త రికార్డులు ఆశిస్తున్నారు.