‘జననాయకన్’ తో సినిమాలకు విజయ్ గుడ్ బై !
By : Surendra Nalamati
Update: 2025-03-01 04:22 GMT
తమిళ దళపతి విజయ్ తన తాజా చిత్రం "జననాయకన్" షూటింగ్ పూర్తయ్యాక పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారని అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో జరిగిన తన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు.
ఈ ప్రకటనతో విజయ్ భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తారా అనే ఊహాగానాలకు తెరపడింది. గత ఏడాది విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని అనౌన్స్ చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.
"ఇది నా 69వ చిత్రం, అలాగే చివరి చిత్రం కూడా. ఇకపై పూర్తిగా ప్రజాసేవకే అంకితమవుతాను," అని విజయ్ స్పష్టం చేశారు. మరో సినిమా చేయబోనని తేల్చి చెప్పారు. విజయ్ లక్ష్యం 2026లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం. అది సాధ్యం కాకపోతే 2031 ఎన్నికల కోసం కృషి చేస్తానని తెలిపారు.