ప్రభుదేవా ‘కంటిన్యుటీ’ ట్వీట్ వెనుక మర్మం!
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రభుదేవా, తన కుమారుడు రిషి రఘవేందర్ దేవాతో కలిసి స్టేజ్‌పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి పెర్ఫార్మ్ చేయడం విశేషం.
ఈ ప్రదర్శనలో ప్రభుదేవా తనదైన స్టెప్పులతో మెస్మరైజ్ చేయగా, రిషి ‘పెట్టా రాప్’ పాటకు ఎనర్జిటిక్ డాన్స్ తో అదరగొట్టాడు. తండ్రి తనయుల కలయికలో స్టేజ్ హోరెత్తిపోయింది. ఈ వీడియోను ప్రభుదేవా సోషల్ మీడియాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ పెర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు రిషిని మరో డాన్స్ ఐకాన్‌గా ప్రశంసిస్తున్నారు!
అలాగే రిషితో కలిసి ఉన్న ఫొటోను ప్రభుదేవా షేర్ చేస్తూ, 'కంటిన్యుటీ' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తన వారసత్వాన్ని కొడుకు కొనసాగిస్తాడన్న ఉద్దేశంతో ప్రభుదేవా ఆ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది