తమిళ హీరో విశాల్ కు అస్వస్థత !

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాకం లోని కూతాండవర్ దేవాలయ ఉత్సవంలో జరిగిన ‘తిరునంగైవుల అలకిప్ పోటీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, స్టేజీ పై మాట్లాడుతున్న సమయంలో సడెన్ గా స్పృహ తప్పి పడిపోయారు.;

By :  K R K
Update: 2025-05-12 04:58 GMT

తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన కోలీవుడ్ నటుడు విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాకం లోని కూతాండవర్ దేవాలయ ఉత్సవంలో జరిగిన ‘తిరునంగైవుల అలకిప్ పోటీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, స్టేజీ పై మాట్లాడుతున్న సమయంలో సడెన్ గా స్పృహ తప్పి పడిపోయారు.

ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు, కథనాలు వెలువడుతున్నాయి. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే ఆయన, ఇటీవల అనారోగ్యంగా, శరీరం బలహీనంగా కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. జనవరిలో "మదగజరాజ" సినిమా ప్రమోషన్‌లో కూడా ఆయన అలసటగా, శరీర బలహీనతతో కనిపించారు.

ఇప్పటి ఘటనతో విశాల్ ఆరోగ్యంపై అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి ముఖ్యమైన కారణంగా ఆహారం తినకపోవడం, అలసటగా ఉండటం కారణమని వైద్యులు భావిస్తున్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్ హీరోగా ఎంతో పేరొందిన ఆయన, మళ్లీ అదే ఉత్సాహంతో వెండితెరపై దర్శనమివ్వాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News