రజినీకాంత్ ‘కూలీ’.. రికార్డు బ్రేకింగ్ డీల్ !

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.;

By :  K R K
Update: 2025-03-16 11:50 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘కూలీ’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా.. ఇది ఇప్పటివరకు అత్యధిక మొత్తానికి అమ్ముడైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజినీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. కథకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అందలేదు కానీ.. సినిమాలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనున్నారు.

ఇటీవల వరుసగా వచ్చిన రూమర్స్ ప్రకారం.. హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమాతో ‘కూలీ’ సినిమా రిలీజ్ డేట్ క్లాష్ అవుతుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ‘కూలీ’ వేరే తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ ‘జైలర్ 2’ లోనూ నటించనున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించే ఈ సీక్వెల్‌లో ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజినీకాంత్ మరోసారి దర్శనమివ్వనున్నారు.

Tags:    

Similar News