ఫరియా అబ్దుల్లా... కోలీవుడ్ వైపు అడుగులు
ఫరియా తన తమిళ డెబ్యూ మూవీగా ‘మయిల్’ (నెమలి) ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రంలో ఆమె విజయ్ ఆంటోనీ సరసన ప్రధాన పాత్ర పోషిస్తోంది.;
ఫరియా అబ్దుల్లా తన బోల్డ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తోనే కాకుండా, కెరీర్‌లో చేస్తున్న కొత్త ప్రయోగాలతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మత్తు వదలరా 2’లో తన నటనతో పాటు, ఓ పాటను స్వయంగా రాసి, పాడడం ద్వారా తన బహుముఖ ప్రతిభను మరోసారి చాటుకుంది. ఇప్పుడు ఆమె కోలీవుడ్ బాట పట్టింది. అది కూడా ఊహించని వేగంతో. ఫరియా తన తమిళ డెబ్యూ మూవీగా ‘మయిల్’ (నెమలి) ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రంలో ఆమె విజయ్ ఆంటోనీ సరసన ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమె మరో భారీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది.
సూపర్‌స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలు ప్రముఖ కథానాయికలు పోటీ పడినప్పటికీ, చివరకు ఫరియానే ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది.
తన తొలి తమిళ చిత్రం విడుదల కాకముందే మరో ప్రతిష్టాత్మక సినిమా అవకాశాన్ని దక్కించుకోవడం ఫరియా కెరీర్‌కి అమూల్యమైన బూస్ట్. ఇది ఆమెకు కోలీవుడ్‌లో మరిన్ని అవకాశాలకు తెర తీయబోతోందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల్లోనే కోలీవుడ్‌లో వరుసగా రెండు చిత్రాలను ఖాయం చేసుకున్న ఫరియా.. తమిళ పరిశ్రమలో కొత్త స్టార్‌గా నిలుస్తుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.