రాజ్ తరుణ్ తమిళ డెబ్యూ షురూ !

రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'రఫ్ నోట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.;

By :  K R K
Update: 2025-05-12 01:12 GMT

యంగ్ హీరో రాజ్ తరుణ్ తన మాజీ ప్రేయసి లావణ్య కారణంగా వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ వివాదం అతన్ని వెంటాడుతున్నా, తన సినీ కెరీర్‌ను సరైన దిశగా తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'రఫ్ నోట్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రాల్లో ‘గోలీ సోడా’, ‘బైరాగి’, ‘కడుగు’లు మంచి గుర్తింపు తెచ్చుకున్నవి. ఇప్పుడు రాజ్ తరుణ్ నటించనున్న సినిమా కూడా గోలీ సోడా ఫ్రాంచైజీలో భాగంగా రూపొందనుందని తెలుస్తోంది.

ఈ సినిమా యాక్షన్‌తో నిండి, హై ఎనర్జీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. రాజ్ తరుణ్ కెరీర్‌కు ఈ సినిమా మలుపుతిప్పే అవకాశముందని సినీ వర్గాల్లో అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Tags:    

Similar News