'ఓజీ సంభవం' పాటకు హిట్ టాక్!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో త్రిష హీరోయిన్‌గా నటించింది.;
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన టీజర్ అజిత్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలతో భారీ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఓజీ సంభవం' మాస్ బీట్స్, పవర్‌ఫుల్ లిరిక్స్‌తో అజిత్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
ఈ సినిమాలో అజిత్ అమాయకపు నిజాయితీపరుడు (గుడ్), భయంకరమైన క్రూరుడు (బ్యాడ్), స్టైలిష్ యాక్షన్ హీరో (అగ్లీ) అనే మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇక అజిత్ సినిమాలంటే కోలీవుడ్‌లో పండగ వాతావరణమే. థియేటర్ల వద్ద అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా ఆ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.