వయలెన్స్ పీక్స్‌లో ‘హిట్ 3’!
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' థియేటర్లలోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఈ సినిమా కంటెంట్ గురించి పలు ఆసక్తికర విశేషాలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.;
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' థియేటర్లలోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఈ సినిమా కంటెంట్ గురించి పలు ఆసక్తికర విశేషాలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'హిట్ 3'కి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాల నిడివిగా ఉంటుందట. 'హిట్' సిరీస్ లోని తొలి రెండు చిత్రాలు కేవలం తెలుగు వరకే పరిమితమైతే ఈసారి 'హిట్ 3' పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనేపథ్యంలో అన్ని భాషల్లోనూ ప్రచారాన్ని నిర్వహించడానికి హీరో, నిర్మాత నాని సిద్ధమవుతున్నాడు.
‘సైంధవ్’ డిజాస్టర్ తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు డైరెక్టర్ శైలేష్ కొలను కృషి చేస్తున్నాడు. ఇక 'హిట్ 3'లోని వయలెన్స్ డోసు ఓ రేంజులో ఉండబోతున్నట్టు ఇప్పటికే టీజర్ ను బట్టి తెలిసింది. రేపు రాబోతున్న ట్రైలర్ తో ఆ వయలెన్స్ మీటర్ మరింత పెరిగే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.