హ్యాక్ అయిన హీరో ఉపేంద్ర ఫోన్
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య నటి ప్రియాంక ఆశ్చర్యకరంగా సైబర్ మోసానికి గురయ్యారు. డెలివరీ పేరుతో వచ్చిన ఒక కాల్ కారణంగా వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి.;
కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య నటి ప్రియాంక ఆశ్చర్యకరంగా సైబర్ మోసానికి గురయ్యారు. డెలివరీ పేరుతో వచ్చిన ఒక కాల్ కారణంగా వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. హ్యాకర్లు వారి పేరుతో పరిచయస్తులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు బయటపడింది.
ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి వెల్లడించారు. ‘మా ఫోన్‌లు హ్యాక్ అయ్యాయి. మా పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే దయచేసి స్పందించవద్దు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాము‘ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రియాంక కూడా స్క్రీన్‌షాట్‌లు షేర్ చేస్తూ, హ్యాకర్లు రూ.55 వేల వరకు డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఇటీవల ‘కూలీ‘ సినిమాలో కేమియోలో మురిపించిన ఉపేంద్ర.. ప్రస్తుతం రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా‘లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ సూపర్ స్టార్ రోల్ లో మురిపించబోతున్నాడు ఉపేంద్ర. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది.