పీపుల్ మీడియాలో ‘జాంబిరెడ్డి 2‘
‘మిరాయ్‘ తర్వాత తేజ సజ్జా నుంచి రాబోయే సినిమా ఏంటి? అనే సస్పెన్స్ కు తెరపడింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ షో వేదికగా నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. తేజ సజ్జ హీరోగా ‘జాంబిరెడ్డి పార్ట్ 2‘ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు;
‘మిరాయ్‘ తర్వాత తేజ సజ్జా నుంచి రాబోయే సినిమా ఏంటి? అనే సస్పెన్స్ కు తెరపడింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ షో వేదికగా నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. తేజ సజ్జ హీరోగా ‘జాంబిరెడ్డి పార్ట్ 2‘ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జాంబీ జానర్‌ను మిక్స్ చేసి రూపొందిన ‘జాంబిరెడ్డి‘ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ మరింత గ్రాండ్‌గా, భారీ విజువల్స్‌తో తెరకెక్కనుంది. ఈసారి దర్శకత్వ బాధ్యతలు బాలీవుడ్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ ను మాత్రం ప్రశాంత్ వర్మ అందిస్తున్నాడట. 2027 సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకు రాబోతున్నారు.
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సీక్వెల్ పాన్ వరల్డ్ మూవీగా వస్తుండటం ప్రత్యేక ఆకర్షణ. ‘హనుమాన్, మిరాయ్‘ విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న తేజ సజ్జ ‘జాంబిరెడ్డి 2‘తో మరో పాన్ ఇండియా హిట్ అందుకుంటాడేమో చూడాలి.