హరీష్ శంకర్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం!
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు తనదైన ముద్రవేసిన దర్శకుడు హరీష్ శంకర్, ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు.;
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు తనదైన ముద్రవేసిన దర్శకుడు హరీష్ శంకర్, ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతని గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సెన్సేషనల్ కాంబినేషన్‌తో ప్లాన్ చేస్తున్నాడు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో హరీష్ శంకర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే కథను సల్మాన్‌కు వినిపించగా, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
గతంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’కి రీమేక్. ఇప్పుడు హరీష్ శంకర్, సల్మాన్‌తో డైరెక్ట్ సినిమా చేస్తుండటం విశేషం. అయితే, ఇది మరో రీమేక్ సినిమా అవుతుందా, లేక ఒరిజినల్ కథతో రానుందా అనేదానిపై ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది.