చివరి షెడ్యూల్ లో ‘హరి హర వీరమల్లు‘

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘ చిత్రం ఈసారైనా అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనే అనుమానాలు మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘వీరమల్లు‘ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది.;

By :  S D R
Update: 2025-02-05 06:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు‘ చిత్రం ఈసారైనా అనుకున్న సమయానికి వస్తోందా? లేదా? అనే అనుమానాలు మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ‘వీరమల్లు‘ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇక ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాని విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.

అయితే మార్చి 28నే నితిన్ ‘రాబిన్ హుడ్‘ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది. అలాగే సితార నుంచి ‘మ్యాడ్ స్క్వేర్‘ కూడా మార్చి 29న రాబోతుంది. ఇంకా మోహన్ లాల్ ‘ఎంపురాన్‘, విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2‘ వంటి పాన్ ఇండియా మూవీస్ కూడా అప్పుడే రాబోతున్నాయి. ఈనేపథ్యంలో ‘హరి హర వీరమల్లు‘ సమ్మర్ కి రావడం కష్టమే అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ చిత్రబృందం మాత్రం ఈసారి అనుకున్న సమయానికి ‘వీరమల్లు‘ వస్తాడు అని కాన్ఫిడెంట్ గా చెబుతోంది.

లేటెస్ట్ గా ‘హరి హర వీరమల్లు‘ చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకుందట. ఈ విషయాన్ని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కబీర్ దుహాన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘వీరమల్లు‘ లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్టు ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ప్రేమికులరోజు కానుకగా ‘హరి హర వీరమల్లు‘ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

https://x.com/Kabirduhansingh/status/1886991092081389792

Tags:    

Similar News