గ్రోక్ vs ‘మ్యాడ్’ గ్యాంగ్!
ఈ నెల చివరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ జరగబోతుంది. తెలుగు నుంచి ‘రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్‘ చిత్రాలు మార్చి 28న వస్తుంటే.. ఒకరోజు ముందుగానే మార్చి 27న తమిళ అనువాద చిత్రం 'వీర ధీర శూర-2', మలయాళ అనువాద చిత్రం 'ఎల్ 2: ఎంపురాన్' విడుదలకు ముస్తాబవుతున్నాయి.;
ఈ నెల చివరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ జరగబోతుంది. తెలుగు నుంచి ‘రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్‘ చిత్రాలు మార్చి 28న వస్తుంటే.. ఒకరోజు ముందుగానే మార్చి 27న తమిళ అనువాద చిత్రం 'వీర ధీర శూర-2', మలయాళ అనువాద చిత్రం 'ఎల్ 2: ఎంపురాన్' విడుదలకు ముస్తాబవుతున్నాయి.
విడుదలకు ఇంకా కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమాలు ప్రచారంలో స్పీడు పెంచాయి. ముఖ్యంగా తెలుగులో ‘రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్‘ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
లేటెస్ట్ గా ‘మ్యాడ్‘ గ్యాంగ్ తమ సినిమాకోసం ఓ పోస్టర్ ను డిజైన్ చేయమని ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్‘ను అడగడం.. ఆ తర్వాత అది డిజైన్ చేసిన పోస్టర్ చూసి వాళ్లు షాకవ్వడం వంటి ఫన్నీ చిట్ చాట్ తో ఓ ప్రమోషనల్ వీడియోని వదిలింది టీమ్. మొత్తంగా సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్‘కి సీక్వెల్ గా వస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్‘తో మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అని చెబుతుంది టీమ్.