ఫిష్ వెంకట్‌కు అండగా ప్రభుత్వం
నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీ సమస్యలు తలెత్తడంతో ఇటీవల పరిస్థితి విషమంగా మారింది.;
నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కిడ్నీ సమస్యలు తలెత్తడంతో ఇటీవల పరిస్థితి విషమంగా మారింది. గతంలో డయాలసిస్‌తో నెట్టుకొచ్చిన ఆయనకు ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, చికిత్సకు అవసరమైన అన్ని విధాలా ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఖర్చుల కోసం లక్ష రూపాయలు అందజేశారు.
వెంకట్ కుటుంబం తరఫున ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ప్రజల సహాయాన్ని కోరుతూ, నేరుగా ఆసుపత్రికి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.