మెగా సినిమాలో గ్లామర్ హంట్!

మెగాస్టార్ చిరంజీవి, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు సినిమాలో ఇతర నటీనటులపై దృష్టి పెట్టాడట.;

By :  S D R
Update: 2025-03-16 02:36 GMT

మెగాస్టార్ చిరంజీవి, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో సక్సెస్ అందుకున్న అనిల్, చిరంజీవి సినిమా పనుల్లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రచనలో వేగం పెంచిన అనిల్, మొదటి భాగాన్ని వైజాగ్‌లో పూర్తి చేసి, మిగిలిన పని హైదరాబాద్‌లో ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు సినిమాలో ఇతర నటీనటులపై దృష్టి పెట్టాడట. ఈ సినిమాకి ఇప్పుడు ప్రధానమైన సవాల్, చిరంజీవికి సరైన కథానాయికను ఎంపిక చేయడం. సీనియర్ స్టార్లకు జోడీగా హీరోయిన్ ను ఎంపిక చేయడం దర్శకులకు కష్టతరమైన విషయంగా మారింది. 'సంక్రాంతికి వస్తున్నాం'లో వెంకటేష్ కోసం అనిల్ రావిపూడి హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ కోసం ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు.

ఇక మెగాస్టార్ తో సినిమా అంటే హీరోయిన్లు డ్యాన్సుల్లో కుమ్మేయాలి. ఒకవైపు పెర్ఫామెన్స్, గ్లామర్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. మరోవైపు డ్యాన్సుల్లో అదరగొట్టే భామల కోసం అన్వేషణ మొదలు పెట్టాడట అనిల్ రావిపూడి. ప్రస్తుతానికైతే మీనాక్షి చౌదరి, అదితి రావు హైదరీ వంటి నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. 2026 సంక్రాంతి టార్గెట్ గా చిరు సినిమాని రెడీ చేయనున్నాడు అనిల్ రావిపూడి.

Tags:    

Similar News