'ఘాటి' నుంచి ఫస్ట్ సింగిల్!

అందాల తార అనుష్క నటించిన 'ఘాటి' సినిమా జూలై 11న విడుదలకు ముస్తాబవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.;

By :  S D R
Update: 2025-06-20 16:20 GMT

అందాల తార అనుష్క నటించిన 'ఘాటి' సినిమా జూలై 11న విడుదలకు ముస్తాబవుతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది. 'సైలోరే' అంటూ సాగే ఈ గీతాన్ని రేపు (జూన్ 21) విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

హీరోహీరోయిన్లు విక్రమ్ ప్రభు, అనుష్క లపై చిత్రీకరించిన ఈ గీతం ఓ పెళ్లి నేపథ్యంలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సాగర్ నాగవెల్లి మ్యూజిక్ లో క్రిష్ స్వయంగా రాసిన ఈ పాటను లిప్సిక భాష్యం, సాగర్ నాగవెల్లి, సోనీ కోమండూరి ఈ పాటను ఆలపించారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' తర్వాత అనుష్క నుంచి వస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News