ట్రైలర్ తో మారిపోయిన అంచనాలు!
ఇన్నాళ్లుగా 'హరిహర వీరమల్లు' చుట్టూ తిరిగిన అనేక అనుమానాలు, అపార్థాలు.. ఒక్క ట్రైలర్ తో పటాపంచలు అయిపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ ఓ మాస్ హంగామా కనిపిస్తుంది.;
ఇన్నాళ్లుగా 'హరిహర వీరమల్లు' చుట్టూ తిరిగిన అనేక అనుమానాలు, అపార్థాలు.. ఒక్క ట్రైలర్ తో పటాపంచలు అయిపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ ఓ మాస్ హంగామా కనిపిస్తుంది. కానీ 'వీరమల్లు' విషయంలో ఆ ఊపు మొదట కాస్త తగ్గినట్టు కనిపించింది. షూటింగ్ డిలే, డైరెక్టర్ మార్పుల వలన ఈ ప్రాజెక్ట్ మీద నెగెటివ్ ప్రచారం జరిగింది.
నిర్మాత ఎ.ఎం. రత్నం చెప్పిన మాట - 'ట్రైలర్ వస్తే క్రేజ్ వస్తుంది' అనేది వంద శాతం నిజమైంది. ఈ ట్రైలర్ ఎమోషన్, ఎనర్జీ, ఎలివేషన్ – అన్నిటినీ చూపిస్తూ అంచనాలు రెట్టింపు చేసింది. స్కేల్ పరంగానూ ఇది ఓ గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తోంది. ఎ.ఎం. రత్నం స్టాండర్డ్ ఎక్కడా తగ్గలేదు.
త్రివిక్రమ్ స్వయంగా ట్రైలర్ కట్‌లో పాల్గొనడం, పవన్ కూడా 'వీరమల్లు' ట్రైలర్ కోసం ఆసక్తి చూపించడం వంటి అంశాలు ఫ్యాన్స్‌కి ఎక్స్‌ట్రా హైప్ ఇచ్చాయి. ఒక్కో షాట్‌లో పవన్ కళ్యాణ్ ఒక్కో తరహాలో కనిపించడం. పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్, ధర్మం మీద పవన్ ఆయన చూపించే కమిట్‌మెంట్ – ఇవన్నీ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించాయి.
ఇక కాస్ట్యూమ్స్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాకా అన్నీ టాప్ నాచ్. ట్రైలర్ రిలీజైన వెంటనే, మార్కెట్ వాతావరణం కూడా మారిపోయింది. బిజినెస్ హంగామా స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ ఫుల్ ఛార్జ్‌లోకి వచ్చేశారు. మొత్తంగా.. ఇదే ఊపులో సినిమాని ఇంకా బాగా ప్రమోట్ చేస్తే జూలై 24న 'హరి హర వీరమల్లు'కి అత్యద్భుతమైన స్టార్ట్ లభించినట్టే.