దిల్ రాజుపై ఆరోపణలు చేసిన ఎగ్జిబిటర్

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజమండ్రి నగర ఇన్‌ఛార్జ్ అత్తి సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.;

By :  S D R
Update: 2025-05-28 11:13 GMT

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వివాదంలో జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజమండ్రి నగర ఇన్‌ఛార్జ్ అత్తి సత్యనారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ పిలుపు వెనుక తన పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ బంద్ నిర్ణయం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి తీసుకున్నారని, సోదరుడిని కాపాడుకోవడానికి దిల్ రాజు తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు.

జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు‘ విడుదల సమయంలో రావడంతో జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బంద్ వెనుక జనసేన నేతల పాత్ర ఉందని నిర్మాత దిల్ రాజు ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత అత్తి సత్యనారాయణ పేరు బంద్ పిలుపు వెనుక ప్రధానంగా వినిపించింది. దీంతో, జనసేన అధిష్ఠానం అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, రాజమండ్రి ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి.. అత్తి సత్యానారాయణ ఆరోపణలపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News