‘ట్రోలింగ్ ఆపాలంటే డబ్బు చెల్లించాలా?‘ – పూజా హెగ్డే ఆవేదన!

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే కొన్నాళ్ల పాటు ఫ్లాపులతో సతమతమైంది. తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లిన పూజా అక్కడ కూడా అంతగా విజయం సాధించలేకపోయింది.;

By :  S D R
Update: 2025-03-25 11:23 GMT

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే కొన్నాళ్ల పాటు ఫ్లాపులతో సతమతమైంది. తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ వైపు వెళ్లిన పూజా అక్కడ కూడా అంతగా విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ప్రస్తుతం తమిళంలో వరుస ప్రాజెక్ట్స్ తో మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇక చాలామంది నటీమణుల తరహాలోనే పూజా హెగ్డే కూడా సోషల్ మీడియా ట్రోలింగ్‌ బారిన పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందిస్తూ, ట్రోలింగ్‌ కోసం కొందరు డబ్బు ఇచ్చి తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నట్లు తేలిందని చెప్పింది. తనను లక్ష్యంగా చేసుకున్న ట్రోలింగ్ వల్ల కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడ్డారని, దీనిని ఆపాలంటే కూడా డబ్బు చెల్లించాలని వాళ్లు సూచించారని ఆమె తెలిపింది.

తనపై జరుగుతున్న ఈ నెగెటివ్‌ క్యాంపెయిన్‌ను తాను పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు తన లక్ష్యం పూర్తిగా సినిమాలపై మాత్రమే ఉందని పూజా హెగ్డే స్పష్టం చేసింది. ప్రస్తుతం తమిళంలో సూర్యతో ‘రెట్రో‘, విజయ్ కి జోడీగా ‘జన నాయగన్‘, రాఘవ లారెన్స్ ‘కాంచన 4‘ చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

Tags:    

Similar News