దిల్‌ రాజు డ్రీమ్స్

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, కేవలం విజయవంతమైన సినిమాల నిర్మాతగానే కాదు, గొప్ప ట్యాలెంట్ హంటర్‌గానూ గుర్తింపు పొందారు.;

By :  S D R
Update: 2025-05-21 03:35 GMT

టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, కేవలం విజయవంతమైన సినిమాల నిర్మాతగానే కాదు, గొప్ప ట్యాలెంట్ హంటర్‌గానూ గుర్తింపు పొందారు.నూతన దర్శకులు, రచయితలు, నటులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండే వ్యక్తి. ఇప్పటికే ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా అనేకమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లకు అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ఆయన ఈ దిశగా మరో కొత్త అడుగు వేసారు.

‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరిట కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఆయన ఒక ప్రత్యేక సంస్థను స్థాపించినట్లు ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనుకునే కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్టు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి రిజిష్ట్రేషన్స్ మొదలయ్యాయి. జూన్ లో భారీ వేడుకను నిర్వహించబోతున్నారు.

ఇప్పటికే ఈ ప్రకటనకు సోషల్ మీడియా వేదికగా విశేష స్పందన లభిస్తోంది. ఎంతోమంది సినీ అభిమానం కలిగిన యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రయాణం ద్వారా మరెన్నో విలక్షణమైన కథలతో, వినూత్న ప్రతిభావంతులతో తెలుగు సినిమా ముందుకెళ్లబోతోందనడంలో సందేహం లేదు.



Tags:    

Similar News