రేపటి నుంచి తమిళంలో ‘డాకు మహారాజ్‘
By : Surendra Nalamati
Update: 2025-01-16 07:17 GMT
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‘ సంక్రాంతి బరిలో సెన్సేషనల్ హిట్ గా దూసుకెళ్తుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నాలుగు రోజులకు గానూ రూ.105 కోట్లు వసూళ్లను సాధించింది. ఇంకా ఈ వీకెండ్ వరకూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ‘డాకు మహారాజ్‘ రన్ స్ట్రాంగ్ గా ఉండబోతుంది.
మరోవైపు రేపటి (జనవరి 17) నుంచి తమిళంలోనూ ‘డాకు మహారాజ్‘ సందడి చేయబోతుంది. తమిళంలో కూడా ‘డాకు మహారాజ్‘ టైటిల్ తోనే థియేటర్లలోకి దూకబోతుంది. ఈ సినిమాలో డాకు మహారాజ్, సీతారామ్, నానాజీ గా మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో అదరగొట్టాడు నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో సితార నిర్మించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తమిళ ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.