అచ్చొచ్చిన తేదీనే రానున్న మెగా ‘విశ్వంభర‘!
‘విశ్వంభర‘ విడుదల తేదీ గురించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాని మే 9న విడుదల చేయబోతున్నారనేదే ఆ న్యూస్.;
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటింగ్ మూవీ ‘విశ్వంభర‘. అసలు సంక్రాంతి బరిలోనే రావాల్సిన ఈ చిత్రం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘ కారణంగా వాయిదా పడింది. ‘బింబిసార‘ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ‘విశ్వంభర‘ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి.
లేటెస్ట్ గా ‘విశ్వంభర‘ విడుదల తేదీ గురించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాని మే 9న విడుదల చేయబోతున్నారనేదే ఆ న్యూస్. గతంలో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీస్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్‘ మే 9వ తేదీలలోనే విడుదలయ్యాయి. ఇప్పుడు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ తరహాలో ఆద్యంతం సోషియో ఫాంటసీగా వస్తోన్న ‘విశ్వంభర‘ని కూడా మే 9న తీసుకురావాలనేది నిర్మాతల ప్లాన్ అట.
అయితే మే 9న ఇప్పటికే రవితేజ ‘మాస్ జాతర‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఒకవేళ చిరంజీవి రంగంలోకి దిగితే రవితేజ వెనక్కి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదేమైనా.. ‘విశ్వంభర‘ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రటకన రావాల్సి ఉంది.