'స్పిరిట్'పై క్రేజీ అప్డేట్!
రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందే భారీ చిత్రం 'స్పిరిట్'. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.;
రెబెల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందే భారీ చిత్రం 'స్పిరిట్'. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా గురించి గత కొంతకాలంగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా, ఈ చిత్రం ఆలస్యమవుతుందని, షూటింగ్ ప్రారంభం గురించి స్పష్టత లేదని వస్తున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతూ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. 'స్పిరిట్' షూటింగ్ మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుందని, ఆలస్యం వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి గత చిత్రాలు 'అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్' కల్ట్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సందీప్ రెడ్డి.. ప్రభాస్ తో తొలిసారి పనిచేస్తున్న మూవీ 'స్పిరిట్'.
ఈ సినిమా పోలీస్ డ్రామాగా, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుంది. ప్రభాస్ ఈ చిత్రంలో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పైగా.. ఇది ప్రభాస్ కెరీర్ లో 25వ చిత్రంగానూ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపానీస్ భాషల్లో 'స్పిరిట్'ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్ 'ది రాజా సాబ్, ఫౌజీ' చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.