50 కోట్ల క్లబ్‌లో 'కోర్ట్'

కొత్త దర్శకుడిపై నమ్మకంతో నాని నిర్మించిన 'కోర్ట్' అద్భుత విజయాన్ని అందుకుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండానే కేవలం కంటెంట్ బలంతో ఈ ఎమోషనల్ డ్రామా రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది.;

By :  S D R
Update: 2025-03-24 14:16 GMT

కొత్త దర్శకుడిపై నమ్మకంతో నాని నిర్మించిన 'కోర్ట్' అద్భుత విజయాన్ని అందుకుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండానే కేవలం కంటెంట్ బలంతో ఈ ఎమోషనల్ డ్రామా రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. మొదటి వారంలోనే రూ.39 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, రెండో వీకెండ్‌తో రూ.50 కోట్ల మార్క్‌ను దాటింది.

మొత్తంగా నేచురల్ స్టార్ నాని విడుదలకు ముందే 'కోర్ట్' చిత్రం హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. నాని జడ్జ్‌మెంట్ నిజం చేస్తూ ఇప్పుడు 'కోర్ట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల మార్క్ అందుకుని 'ఎ హిస్టారిక్ జడ్జ్‌మెంట్' ఇచ్చింది.

ఇక ఈ వారం 'కోర్ట్' సినిమాకి బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటేషన్ ఉండబోతుంది. తెలుగు నుంచి 'రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్'తో పాటు అనువాద రూపంలో 'ఎంపురాన్, వీర ధీర శూర2' కూడా విడుదలకు ముస్తాబవుతున్నాయి. మరి.. ఈ కాంపిటేషన్ లోనూ 'కోర్ట్' ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News