'తండేల్' ట్రైలర్ కి కౌంట్ డౌన్ షురూ!
'తండేల్' నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. రేపు (జనవరి 28) రాబోతున్న 'తండేల్' ట్రైలర్ ఎలా ఉంటుంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు.;
ప్రస్తుతం తెలుగు నుంచి రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'తండేల్' మొదటి స్థానంలో ఉంటుంది. ఫిబ్రవరి 7న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'తండేల్'పై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న 'తండేల్' నుంచి మూడు పాటలు వచ్చాయి. ఈ పాటలన్నింటికీ మంచి స్పందన లభించింది. లేటెస్ట్ గా 'తండేల్' నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. రేపు (జనవరి 28) రాబోతున్న 'తండేల్' ట్రైలర్ ఎలా ఉంటుంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు.
ఇప్పటికే నాగచైతన్య కి '100 పర్సెంట్ లవ్' వంటి హిట్ అందించిన గీతా ఆర్ట్స్.. 'తండేల్'తో మరో మెగా హిట్ ఇస్తుందనే అంచనాలున్నాయి. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి ఈ సినిమాతో మరోసారి ఆన్ స్క్రీన్ పై తమ లవ్ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.