చిరు క్యాలెండర్ హౌస్‌ఫుల్!

టాలీవుడ్ సీనియర్స్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న వారిలో మెగాస్టార్ ముందు వరుసలో నిలుస్తాడు. 'భోళా శంకర్' వంటి భారీ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేసిన చిరు.. ఇప్పుడు వరుసగా కుర్ర హీరోలతో సినిమాలను లైన్లో పెట్టాడు.;

By :  S D R
Update: 2025-03-19 15:05 GMT

టాలీవుడ్ సీనియర్స్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న వారిలో మెగాస్టార్ ముందు వరుసలో నిలుస్తాడు. 'భోళా శంకర్' వంటి భారీ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేసిన చిరు.. ఇప్పుడు వరుసగా కుర్ర హీరోలతో సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా ఈ ఏడాది 'విశ్వంభర'తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ ఏడాది మే నుంచి అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కిస్తాడు. చిరు-అనిల్ మూవీ నాన్‌స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుని వచ్చే సంక్రాంతి బరిలో విడుదల కానుంది.

ఇక ఈ ఏడాది చివరి నుంచే బాబీ దర్శకత్వంలో ఒక సినిమాని లైన్లో పెడతాడట మెగాస్టార్. ఇప్పటికే చిరు-బాబీ కలయికలో 'వాల్తేరు వీరయ్య' వంటి ఘన విజయం రావడంతో ఈ కాంబినేషన్ పైనా భారీ అంచనాలున్నాయి.

మరోవైపు శ్రీకాంత్ ఓదెలతో ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేశాడు మెగాస్టార్. 'లక్కీ భాస్కర్' డైరెక్టర్ వెంకీ అట్లూరితోనూ ఒక చిత్రం ప్లానింగ్ లో ఉందట. మొత్తంగా మెగా లైనప్ మాత్రం ఎంతో క్రేజీగా ఉంది.

Tags:    

Similar News