ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌తో ఆగిపోయిన తెలుగు సినిమా షూటింగ్స్ సమస్యకు పరిష్కారం లభించింది. కార్మికులు, నిర్మాతల మధ్య చర్చల అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో సమ్మె ఉపసంహరించబడింది.;

By :  S D R
Update: 2025-08-22 01:19 GMT

సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్‌తో ఆగిపోయిన తెలుగు సినిమా షూటింగ్స్ సమస్యకు పరిష్కారం లభించింది. కార్మికులు, నిర్మాతల మధ్య చర్చల అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో సమ్మె ఉపసంహరించబడింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ 'ఇటు నిర్మాతలు, అటు కార్మికుల మధ్య సమన్యాయం జరగేలా పరిష్కారం చూపిన తీరు అభినందనీయం. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి సీఎం గారి కృషి హర్షణీయం' అని ట్వీట్ చేశారు.

అలాగే మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు, ఇండస్ట్రీ నుంచి మరికొంది నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.



Tags:    

Similar News