అక్షయ్ మూవీ సెట్స్‌లో చరణ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందుగా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RC 16' శరవేగంగా పూర్తవుతుంది.;

By :  S D R
Update: 2025-03-22 03:11 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందుగా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RC 16' శరవేగంగా పూర్తవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ ఆట కూలీగా నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేసి, సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకోనుంది. పార్లమెంట్ ఆవరణ, జామా మసీదు పరిసరాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న 'భూత్ బంగ్లా' మూవీ సెట్స్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ సెట్లో చరణ్ ప్రత్యక్షం కావడంతో, ఆయన ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నాడా? లేదా సెట్‌ని సందర్శించడానికి మాత్రమే వెళ్లాడా? అన్న చర్చలు సాగుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ప్రత్యేక పాత్రలకన్నా పూర్తి స్థాయి హిందీ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News