ఫీల్ గుడ్ ఎమోషన్‌తో ‘బ్రహ్మ ఆనందం’ ట్రైలర్!

Update: 2025-02-10 14:27 GMT

ఫీల్ గుడ్ ఎమోషన్‌తో ‘బ్రహ్మ ఆనందం’ ట్రైలర్!ప్రేమికులరోజు కానుకగా థియేటర్లలోకి రాబోతున్న సినిమాలలో 'బ్రహ్మ ఆనందం' ఒకటి. తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ తాత మనవళ్లుగా కనిపించబోతున్న సినిమా ఇది. 'మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద' వంటి హిట్ మూవీస్ తీసిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకత్వంలో రూపొందిన 'బ్రహ్మ ఆనందం' ట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ ఆద్యంతం ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే థియేటర్ ఆర్టిస్ట్ గౌతమ్. అలాంటి గౌతమ్ ని తనకు మనవడిగా నటించమని ఆఫర్ ఇస్తాడు బ్రహ్మానందం. ఆర్థిక అవసరాల రీత్యా అందుకు గౌతమ్ ఒప్పుకుంటాడు. మరి.. తన స్వార్థమే చూసుకునే గౌతమ్.. బ్రహ్మానందంకు మనవడిగా నటించడం మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

మొత్తంగా కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యతనిచ్చే స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో 'బ్రహ్మ ఆనందం'పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News