‘బ్రహ్మ ఆనందం‘ టీజర్.. తాత మనవళ్లుగా తండ్రీకొడుకులు!

Update: 2025-01-16 08:10 GMT

‘బ్రహ్మ ఆనందం‘ టీజర్.. తాత మనవళ్లుగా తండ్రీకొడుకులు!బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ టైటిల్ రోల్స్ లో కనిపించబోతున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం‘. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఈ మూవీలో తాత మనవళ్లుగా నటిస్తుండడం విశేషం. వెన్నెల కిషోర్, ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు ఈ మూవీలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Full View


స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకుడు. తాజాగా ‘బ్రహ్మ ఆనందం‘ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఎంటర్ టైనర్ గా ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 14న ‘బ్రహ్మ ఆనందం‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags:    

Similar News