మే 1న బాక్సాఫీస్ క్లాష్!
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదం మొదలైంది. పిల్లలకు సెలవులు ఇచ్చేయడంతో వరుస సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈకోవలో మే 1న అసలు సిసలు బాక్సాఫీస్ పోటీ నెలకొనబోతుంది.;
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదం మొదలైంది. పిల్లలకు సెలవులు ఇచ్చేయడంతో వరుస సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈకోవలో మే 1న అసలు సిసలు బాక్సాఫీస్ పోటీ నెలకొనబోతుంది. నేచురల్ స్టార్ నాని 'హిట్ 3', విలక్షణ నటుడు సూర్య 'రెట్రో' చిత్రాలు మే 1న బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాయి.
ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ వస్తున్నవే. అయితే ఈ సినిమాలలో 'హిట్ 3' ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్తుంది. ముఖ్యంగా నాని ఈ చిత్రాన్ని తన భుజాలపైకి ఎత్తుకుని అన్ని భాషల్లోనూ జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. అతని మార్కెటింగ్ పద్ధతులు, జాగ్రత్తలు ప్రత్యేకంగా గుర్తించదగినవి. ఒక నటుడిగానే కాకుండా, మార్కెట్ డైనమిక్స్‌ను అర్థం చేసుకునే నిర్మాతగా కూడా నాని పేరు తెచ్చుకుంటున్నాడు.
ఇక 'కంగువా' ఫలితం నిరాశపరిచినా 'రెట్రో'తో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఆలోనలో ఉన్నాడు సూర్య. అయితే 'రెట్రో' ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత శక్తివంతంగా కనిపించడం లేదు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రచారాన్ని ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
మరోవైపు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ 'రెయిడ్ 2' కూడా మే 1న విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే 'రెయిడ్' ఘన విజయాన్ని సాధించడంతో సీక్వెల్ 'రెయిడ్ 2'పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 'హిట్ 3, రెట్రో' చిత్రాలకు బీటౌన్ లో 'రెయిడ్ 2' నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.