‘మిషన్ ఇంపాజిబుల్ : ఫైనల్ రెకనింగ్’ ట్రైలర్ అదిరింది !
ట్రైలర్ ప్రారంభం నుంచే టామ్ క్రూయిజ్ స్వయంగా డిజైన్ చేసి, పర్ఫామ్ చేసిన ఓ అద్భుతమైన యాక్షన్ సన్నివేశంతో మొదలవుతుంది. ఓ హెలికాప్టర్‌కు వేలాడుతూ, పర్వతాల మధ్య గల లోయలో ప్రయాణించడాన్ని చూపించే ఈ సన్నివేశం గుండె ఆగేంత ఉత్కంఠను కలిగిస్తుంది.;
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ ప్రపంచ సినీ ప్రేక్షకులకు కొన్ని అద్భుతమైన యాక్షన్ చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలకంటే... ఆయనే స్వయంగా చేసిన అసాధారణ స్టంట్లు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాయి. ఇలాంటి స్టంట్లే ఆయన తాజా చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 2 ‘ఫైనల్ రెకనింగ్ ' ట్రైలర్ లో కూడా నిండిపోయాయి. ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో.. ఆరంభం నుంచే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. టామ్ క్రూయిజ్‌తో పాటు ఇతర ప్రధాన నటులు కూడా ఇందులో యాక్షన్ లో పాల్గొన్న విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ప్రారంభం నుంచే టామ్ క్రూయిజ్ స్వయంగా డిజైన్ చేసి, పర్ఫామ్ చేసిన ఓ అద్భుతమైన యాక్షన్ సన్నివేశంతో మొదలవుతుంది. ఓ హెలికాప్టర్‌కు వేలాడుతూ, పర్వతాల మధ్య గల లోయలో ప్రయాణించడాన్ని చూపించే ఈ సన్నివేశం గుండె ఆగేంత ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పుడు టామ్ క్రూయిజ్ నుంచి ఇలాంటివే అందరూ ఊహించుకుంటున్నారు. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే, గత ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రాల కంటే మరింత భారీ స్థాయిలో... గ్రాండ్ సెట్టింగ్స్‌తో ఈసారి చిత్రం రూపొందించబడిందని అర్థమవుతుంది. ఇది ఈ ఫ్రాంచైజీలోనే అత్యంత రసవత్తరమైన భాగంగా ఉండనుందన్న అంచనాలు ఉన్నాయి.
టామ్ క్రూయిజ్ ఈ చిత్రానికి గాను ఎన్నో సాహసోపేతమైన స్టంట్లు, అత్యుత్తమ యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా పాల్గొనడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో చివరిది అయ్యే అవకాశమూ ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది మే 23న విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా, ఇది ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలవగలదన్న నమ్మకం పరిశ్రమలో ఉంది.