మరో బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ లో శ్రీలీల?
విక్రాంత్ మాస్సీ, లక్ష్య హీరోలుగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కథానాయికగా శ్రీలీలను తీసుకునేందుకు కరణ్ జోహార్ టీమ్ ముందుకొచ్చిందట. చర్చలు తుదిదశలో ఉండగా, అధికారిక ప్రకటన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.;
సౌత్ ఇండస్ట్రీస్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం అన్నది అంత ఈజీ కాదు. కానీ శ్రీలీల మాత్రం తన స్టెప్స్‌తో చక్కగా కదిలిస్తోంది. సహజమైన నటనా శైలి, తళుకు బెళుకుల డ్యాన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ యంగ్ బ్యూటీ, తన తొలి హిందీ చిత్రం ‘ఆశికీ 3’ థియేటర్లలోకి రావడానికి ముందే రెండో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు .. 2008లో విడుదలై కల్ట్ హిట్‌గా నిలిచిన ‘దోస్తానా’ కి సీక్వెల్ ‘దోస్తానా 2’ . ప్రియాంకా చోప్రా, జాన్ అబ్రహాం నటించిన ఆ చిత్రం తర్వాత మళ్ళీ అదే స్టైల్‌లో సిక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ అభిమానులు. తాజా సమాచారం ప్రకారం.. విక్రాంత్ మాస్సీ, లక్ష్య హీరోలుగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు కథానాయికగా శ్రీలీలను తీసుకునేందుకు కరణ్ జోహార్ టీమ్ ముందుకొచ్చిందట. చర్చలు తుదిదశలో ఉండగా, అధికారిక ప్రకటన కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం చూస్తే.. శ్రీలీల సౌత్ లో తన మాస్ ఫాలోయింగ్‌ను అలాగే కొనసాగించటం తో పాటు బాలీవుడ్‌లో కూడా స్థిరపడాలనే వ్యూహంతో ముందు కెళ్తోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు చిత్రాల్లో ‘మాస్ జాతర, పరాశక్తి’ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్లు ఉన్నాయి. ఇవి ఆమెను తెలుగు తెరపై రచ్చ చేస్తూనే ఉంచుతున్నాయి. ‘దోస్తానా 2’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.