ఈ టైటిల్ కు డిమాండ్ మామూలుగా లేదు !
హిందీ సినిమా పరిశ్రమ "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ ను తమ తదుపరి సినిమాకి ఉపయోగించుకునేందుకు పోటీపడుతోంది. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ఈ టైటిల్‌ను మొదటగా రిజిస్టర్ చేయడంతో, ఇతర నిర్మాతలు కూడా వెంటనే స్పందించారు.;
ఇండియన్ ఆర్మీ తాజాగా నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్" పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై పథకబద్ధమైన దాడిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గాంమ్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది నిరపరాధ పర్యాటకులు మృతి చెందడం ఈ చర్యకు కారణమైంది.
ఇక మరోవైపు.. హిందీ సినిమా పరిశ్రమ "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ ను తమ తదుపరి సినిమాకి ఉపయోగించుకునేందుకు పోటీపడుతోంది. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ఈ టైటిల్‌ను మొదటగా రిజిస్టర్ చేయడంతో, ఇతర నిర్మాతలు కూడా వెంటనే స్పందించారు. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్‌ను నమోదు చేశారని సమాచారం.
ఇక జీ స్టూడియోస్, టీ-సిరీస్ వంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసేందుకు మూడవ మరియు నాల్గవ స్థానాల్లో నిలిచాయి. ఈ సంస్థలన్నీ "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్‌తో సినిమా తీసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాల నుంచి సమాచారం. ఈ టైటిల్ సైనిక దాడికి గుర్తుగా నిలవడమే కాదు, ఉగ్రదాడిలో భర్తలను, కుటుంబ సభ్యులను కోల్పోయిన మహిళల త్యాగానికి ఒక నివాళిగా నిలుస్తుంది. అందుకే, ఈ పేరుపై విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.
అయితే, సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రస్తుతం ఎవరు ఈ టైటిల్‌ను దక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. నిబంధనల ప్రకారం మొదటగా నమోదు చేసిన నిర్మాతకే ఈ టైటిల్ దక్కుతుంది. అయినప్పటికీ, ఈ టైటిల్‌తో సినిమా ఎప్పుడు, ఎవరు ప్రకటిస్తారన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.