‘సింబా’ సీక్వెల్ కు సన్నాహాలు
ముఖ్యంగా ‘సింబా 2’ కి సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నాం’’ అని రోహిత్ శెట్టి తెలిపాడు.;
బాలీవుడ్‌లో పోలీసు కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి ఇప్పుడు మరోసారి తన "కాప్ యూనివర్స్"ను విస్తరించేందుకు సిద్ధమయ్యాడు. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘సింబా’, అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ సినిమాలకు సీక్వెల్‌లు రూపొందించనున్నట్టు ఆయన తాజాగా వెల్లడించారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ, ‘‘సింబా, సూర్యవంశీ సినిమాలు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన అందుకున్నాయి. వాటికి సీక్వెల్‌లు కచ్చితంగా వస్తాయి. ప్రస్తుతం వాటి స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాం. ముఖ్యంగా ‘సింబా 2’ కి సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నాం’’ అని తెలిపాడు.
ఇప్పటికే ‘సింగం, సింబా, సూర్యవంశీ’ చిత్రాలతో భారతీయ సినిమాల్లో ఓ విభిన్న పోలీస్ యూనివర్స్‌ను సృష్టించిన రోహిత్ శెట్టి.. ఈ సీక్వెల్‌లతో మళ్లీ అభిమానులను మెప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ‘సింబా’ సీక్వెల్ తో రణవీర్ సింగ్ ఇంకెంత పవర్ ఫుల్ గా పంజా విసరుతాడో చూడాలి.