తన కొడుకుకు క్షమాపణ చెప్పిన సైఫ్ ఆలీఖాన్

Update: 2025-05-03 07:31 GMT

తన కొడుకుకు క్షమాపణ చెప్పిన సైఫ్ ఆలీఖాన్సైఫ్ అలీ ఖాన్ తాజాగా విడుదలైన సినిమా జువెల్ థీఫ్ వల్ల మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ చిత్రం మార్చి 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఇందులో జైదీప్ అహ్లావత్, కునాల్ కపూర్, నికితా దత్తా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం నటులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇటీవల జైదీప్ అహ్లావత్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా కోసం జర్నలిస్ట్ గౌణంగా సైఫ్ అలీ ఖాన్‌ను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది.

ఈ ఇంటర్వ్యూలో సైఫ్ తన కుమారుడు తైమూర్‌కు ఆదిపురుష్ సినిమా చూపించిన తర్వాత క్షమాపణ చెప్పిన విషయం వెల్లడించారు. "నేను తాజాగా తైమూర్‌కి ఆదిపురుష్ చూపించాను. కొంత సేపటి తర్వాత వాడు నన్ను విచిత్రంగా చూసాడు. వెంటనే నేను ‘సారీ’ అన్నాను. అప్పుడు వాడు ‘సరే నాన్న’ అన్నాడు. మొత్తానికి వాడు నన్ను క్షమించాడు," అని చెప్పినప్పుడు జైదీప్ నవ్వులు ఆపుకోలేకపోయాడు.

ఆదిపురుష్ సినిమా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెల్సిందే. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ మాతా సీతగా నటించగా, సైఫ్ రావణుడి పాత్రలో కనిపించారు. రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కథ, దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ అన్నింటిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ ఫెయిల్యూర్‌గా మిగిలింది. ఈ కారణంగానే సైఫ్ తన కుమారునికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Tags:    

Similar News