టైటిల్, రిలీజ్ డేట్ రెండూ మారాయి
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఆ సినిమా గతంలో ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌తో నవంబర్‌లో విడుదలవుతుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు టైటిల్, రిలీజ్ డేట్ రెండూ మారాయి.;
కోలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సౌత్ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమా ఆమె అభిమానుల సంఖ్యను మరింత పెంచింది. ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తన తొలి ప్రాజెక్ట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సాయిపల్లవి ఇప్పటికే రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా 2026 దీపావళికి విడుదల కానుంది. అయితే ‘రామాయణ్’ కంటే ముందే సాయి పల్లవి బాలీవుడ్ తెరపై కనిపించనుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఆ సినిమా గతంలో ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌తో నవంబర్‌లో విడుదలవుతుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు టైటిల్, రిలీజ్ డేట్ రెండూ మారాయి.
ఈ సినిమా కొత్త టైటిల్ ‘మేరే రహో’. ఇది 2025 క్రిస్మస్‌కి విడుదల కానుందని టాక్. సాయి పల్లవి, జునైద్ ఖాన్ కాంబినేషన్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. జునైద్ గత సినిమాలు ‘లవ్ ఆపా’, ‘మహారాజా’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ సాయి పల్లవి యూనిక్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా ఆకర్షిస్తాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సౌత్‌లో ఆమె సక్సెస్, సహజమైన నటనతో ‘మేరే రహో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త టీమ్, కొత్త కథతో ఈ సినిమా దృష్టిని ఆకర్షిస్తోంది. సాయి పల్లవి హిందీ ప్రేక్షకులను కూడా సౌత్‌లో లాగే సులభంగా ఆకట్టుకుంటుందా అని బాలీవుడ్, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.