కరడు గట్టిన విలన్ గా రణ్ దీప్ హుడా!

Update: 2025-03-10 08:35 GMT

బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ తో టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాట్‘. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో హిందీలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘జాట్‘ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీలో విలన్ రోల్ లో కనిపించబోతున్న రణ్ దీప్ హుడా క్యారెక్టర్ ను పరిచయం చేశారు.


Full View


బాలీవుడ్ లో హీరోగా విలక్షణ పాత్రల్లో నటించిన రణ్ దీప్ హుడా.. ‘జాట్‘లో కరడు గట్టిన ‘రణతుంగ‘ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. రణ్ దీప్ పోషిస్తున్న రణతుంగ ఇంట్రో వీడియో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, రెజీనా కసాండ్రా, సయ్యామీ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషనల్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 10న ‘జాట్‘ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags:    

Similar News