‘రామాయణం’ లో శూర్పణఖ ఎవరు?

శూర్పణఖ పాత్ర కోసం మొదట గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను అనుకున్నారట. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. ఈ రోల్ ఫైనల్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌కి దక్కింది. ఇప్పటికే రకుల్ ఈ పాత్ర కోసం షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది.;

By :  K R K
Update: 2025-06-13 01:45 GMT

సినీ ప్రియులకు షాకింగ్ అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. రాబోయే పౌరాణిక బిగ్ బడ్జెట్ మూవీ ‘రామాయణం’ లో కీలకమైన శూర్పణఖ పాత్ర కోసం మొదట గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను అనుకున్నారట. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. ఈ రోల్ ఫైనల్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌కి దక్కింది. ఇప్పటికే రకుల్ ఈ పాత్ర కోసం షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది.

‘రామాయణం’ చిత్రం ఒక గ్రాండ్ రీటెల్లింగ్‌గా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, మరియు ‘కెజిఎఫ్’ ఫేమ్ యశ్ రావణుడిగా నటిస్తూ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఈ స్టెల్లార్ కాస్ట్‌తో ఈ మూవీ ఇప్పటి నుంచే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలవబోతుందని అందరూ ఫీలవుతున్నారు. భారీ సెట్స్, టాప్-నాచ్ విజువల్ ఎఫెక్ట్స్, ఈ ఎపిక్ స్టోరీకి తగ్గట్టుగా హై ఓల్టేజ్ డ్రామాతో ఈ మూవీ ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. మరి శూర్పణఖ గా రకుల్ ఏ రేంజ్ లో మెప్పి్స్తుందో చూడాలి.

Tags:    

Similar News