ఘాటు విమర్శకు రహమాన్ స్వీట్ ఆన్సర్ !

రెహ్మాన్ కారణంగా లైవ్ వాయిద్య కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందని విమర్శించారు. ల్యాప్‌టాప్‌తోనే సంగీతం సృష్టించవచ్చని రెహ్మాన్ భావిస్తారని, అందుకు మ్యూజిషియన్లు అవసరం లేదని అభిజీత్ ఆరోపించాడు.;

By :  K R K
Update: 2025-04-17 04:04 GMT

ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల సంగీత మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్‌పై విమర్శల వర్షం కురిపించాడు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలను కూడా రెహ్మాన్ వెయిట్ చేయిస్తాడని ఆయన ఆరోపించాడు. అంతేకాకుండా, రెహ్మాన్ సాంకేతికతను అధికంగా వినియోగించడం వల్ల సంగీతాన్ని "చంపుతున్నాడు" అని కూడా అభిజీత్ మండిపడ్డాడు. తాజాగా ఒక మీడియా ఇంటరాక్షన్ లో రహ్మాన్ ఈ విమర్శలపై స్పందించాడు.

"అన్నీ నాపైనే మోపడం చాలా బాగుంది," అని చిరునవ్వుతో రెహ్మాన్ ఆన్సర్ ఇచ్చాడు. "నాకు అభిజీత్ మీద ఇంకా ప్రేమ ఉంది. నేను ఆయనకి కేకులు పంపిస్తాను కూడా. అందరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకునే హక్కుంది, అందులో తప్పు లేదు," అన్నాడు. రెహ్మాన్ కారణంగా లైవ్ వాయిద్య కళాకారుల ప్రాముఖ్యత తగ్గిందని విమర్శించారు. ల్యాప్‌టాప్‌తోనే సంగీతం సృష్టించవచ్చని రెహ్మాన్ భావిస్తారని, అందుకు మ్యూజిషియన్లు అవసరం లేదని అభిజీత్ ఆరోపించాడు.

ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రెహ్మాన్ తన వివరణ ఇచ్చాడు. "ఇటీవలే నేను దుబాయ్‌లో 60 మంది మహిళలతో ఓ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేశాను. వాళ్లందరికీ నెలకు జీతం, ఆరోగ్య బీమా, అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం. నేను చేసే ప్రతి సినిమాలో, ఉదాహరణకు 'ఛావా' గానీ, 'పొన్నియిన్ సెల్వన్' గానీ, 200 నుండి 300 మంది వాయిద్య కళాకారులు పాల్గొంటున్నారు. కొన్ని పాటల్లో 100 మందికి పైగా పనిచేస్తున్నారు. నేను ఫోటోలు పోస్ట్ చేయడం లేదని ఎవరికీ తెలియదు, కానీ పని మాత్రం జరుగుతోంది."

"సంగీతాన్ని ఎంతగా శుద్ధి చేస్తే, లైవ్ మ్యూజిక్ విలువ అంతగా పెరుగుతుంది. కంప్యూటర్లు ప్రత్యేకమైన హార్మనీలు రూపొందించడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తాం. మ్యూజిషియన్లను పిలిపించి తిరస్కరించడం మేము చేయలేం. అందుకే మొదటి దశలో సాఫ్ట్‌వేర్ సహాయంతో పని చేసి, తుది రికార్డింగ్స్ మాత్రం లైవ్‌లోనే చేస్తాం. నేను పని చేసిన ప్రతి నిర్మాతను అడిగి చూడవచ్చు, మేము ఎంతమంది మ్యూజిషియన్లను ఉపయోగిస్తున్నామో," అని ఆస్కార్ గాయకుడు చిరునవ్వుతో అన్నాడు.

Tags:    

Similar News