పృధ్విరాజ్ బాలీవుడ్ చిత్రం ‘దయారా’ షూటింగ్ ప్రారంభం

'దయారా' ప్రస్తుత సంఘటనలను ప్రతిబింబిస్తుంది. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా.;

By :  K R K
Update: 2025-09-25 09:31 GMT

మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సరికొత్త బాలీవుడ్ చిత్రం ‘దయారా’ షూటింగ్ ప్రారంభమైంది. ‘రాజీ, తల్వార్, సామ్ బహదూర్’ వంటి అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటిస్తుండగా... కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుండడం విశేషం. 'దయారా' ప్రస్తుత సంఘటనలను ప్రతిబింబిస్తుంది. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా.

'దయారా'కి ఒక ప్రత్యేకత ఉంది. ‘రాజీ, తల్వార్, బదాయి దో’ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన జంగ్లీ పిక్చర్స్, అలాగే డాక్టర్ జయంతిలాల్ గడా నేతృత్వంలోని పెన్ స్టూడియోస్ మొదటిసారిగా కలిసి పనిచేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను పెద్ద కాన్వాస్‌లో రూపొందిస్తున్నారు.

షూటింగ్ ప్రారంభంలో విడుదలైన మొదటి దృశ్యాలు 'దయారా' ఒక శక్తివంతమైన కథాంశంతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ అవుతుందని సూచిస్తున్నాయి. చాలా కాలం తర్వాత పృథ్వీరాజ్ మళ్లీ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. మేఘన గుల్జార్‌తో పాటు యశ్ కేశవాని, సీమా అగర్వాల్ కలిసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మరి ఈ సినిమా పృధ్విరాజ్ కు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి. 



Tags:    

Similar News